మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో భారత్ (IND vs AUS) ఎదురీదుతున్నది. అనవసర తప్పిదాలతో బ్యాట్స్ మెన్ వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసిన భారత్.. మూడో ఆటను ప్రారంభించిన కొద్దిసేపటికే రిషభ్ పంత్ రూపంలో వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్ 55.4వ ఓవర్లో బోలాడ్ వేసిన బంతిని స్కూప్ షాట్ ఆడబోయిన పంత్ (28).. ఎడ్జ్ తీసుకోవడంతో థార్డ్ స్లిప్‌లో ఉన్న నాథన్ చేతికి చిక్కాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి.. జడేజాతో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 200 దాటింది. ఈ క్రమంలో జడెజా (17) ఔటవడంతో టీమ్ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నాథన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరగాల్సి వచ్చింది. దీంతో 221 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన భారత్ ఫాలోఆన్ గండంలో పడిపోయింది.
అయితే నితీశ్‌తో జతకట్టిన వాషింగ్టన్ సుందర్ జట్టు స్కోరును ఫాల్ ఆన్ ముప్పు నుంచి బయట పడేసేలా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 264 రన్స్ చేసిన టీమ్ఇండియా… మరో 10 పరుగులు చేయాల్సి ఉంది. అంటే జట్టు స్కోరు 275 దాటాల్సి ఉంది. కాగా, 78 బాల్స్‌లో 47 పరుగులు చేసిన నితీశ్ కుమార్ ఆసీస్‌పై మరో హాఫ్ సెంచరీ దీశగా దూసుకెళ్తున్నాడు.