అహ్మదాబాద్: ఇండియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ఎదురీదుతోంది. సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ తగనరైన్ చంద్రపాల్ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. స్క్వేర్ లెగ్‌లో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) అద్భుతమైన రీతిలో ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఎడమ వైపుకు గాలిలో డైవ్ చేస్తూ నితీశ్ ఆ క్యాచ్ పట్టాడు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛. 👏
Nitish Kumar Reddy grabs a flying stunner 🚀
Mohd. Siraj strikes early for #TeamIndia ☝️
Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/1Bph4oG9en
— BCCI (@BCCI) October 4, 2025
తాజా సమాచారం ప్రకారం వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 43 రన్స్ చేసింది. జడేజా రెండు, కుల్దీప్, సిరాజ్ వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌ను 448 రన్స్‌కు డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు 286 రన్స్ ఆధిక్యం లభించింది.