IND vs SL : సూపర్ 4 చివరి మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఉతికేస్తున్నారు. ఓపెనర్ పథుమ్ నిశాంక(61) కుశాల్ పెరీరా(52)లు ఎడాపెడా బౌండరీలతో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కరిగించేస్తున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ ఇద్దరూ 25 బంతుల్లోనే అర్ధ శతకం సాధించారు. ఆది నుంచి నిశాంక దూకుడుగా ఆడడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 72 రన్స్ చేసింది లంక. పెరీరా సైతం ఫోర్లతో రెచ్చిపోగా పది ఓవర్లకు 114 రన్స్ చేసింది అలసంక సేన. రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయం లంకను విజయం దిశగా నడిపిస్తోంది.
విజయంతో టోర్నీని ముగించాలనే కసితో శ్రీలంక బ్యాటర్లు చితక్కొడుతున్నారు. హార్ది్క్ పాండ్యా వేసిన తొలి బంతినే బౌండరీకి పంపిన పథుమ్ నిశాంక(61 నాటౌట్) తన ఉద్దేశాన్ని చాటాడు. కుశాల్ మెండిస్(0) సున్నాకే ఔటైనా.. కుశాల్ పెరీరా (52 నాటౌట్) సాయంతో నిశాంక బౌండరీల మోత మోగించాడు. హర్షిత్ రానా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్.. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకి, బౌండరీకి అన్నంతగా దంచేస్తున్నారిద్దరూ. దాంతో.. పవర్ ప్లేలోనే 72 రన్స్ చేసిన లంక.. పది ఓవర్లకు 114 రన్స్‌తో పటిష్ట స్థితిలో నిలిచింది.
25-ball fifties for each! Sri Lanka well on top of this #INDvSL https://t.co/0ZIfhPyOY1
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2025
ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(61) తనకు అలవాటైన తీరుగా బౌండరీలతో చెలరేగిపోగా టీమిండియా భారీ స్కోర్ చేసింది. కెప తిలక్ వర్మ(49 నాటౌట్), సంజూ శాంసన్(39)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. డెత్ ఓవర్లలో శాంసన్, పాండ్యా వెంట వెంటనే ఔట్ అయినా.. అక్షర్ పటేల్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. చమీర వర్లో ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి జట్టు స్కోర్ 200 దాటించాడు. దాంతో.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.