Nishant Dev : వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయర్‌లో భారత స్టార్ బాక్సర్ నిషాంత్ దేవ్(Nishant Dev) తన పంచ్ వపర్ చూపించాడు. ఈ మెగా టోర్నీలో 71 కిలోల విభాగంలో పోటీ పడుతున్న నిషాంత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన 16వ రౌండ్లో గ్రీస్‌కు చెందిన క్రిస్టోస్ కరాయ్టిస్(Christos Karaitis)ను చిత్తుగా ఓడించాడు. దాంతో, ప్యారిస్ ఒలింపిక్స్ (paris olympics 2024) బెర్తుకు అడుగు దూరంలో నిలిచాడు.
మరొక్క మ్యాచ్‌లో గెలిచాడంటే నిషాంత్ విశ్వక్రీడలకు అర్హత సాధిస్తాడు. ఈ టోర్నీలో సెమీస్ చేరిన నలుగురు బాక్సర్లకు ప్యారిస్ ఒలింపిక్ బెర్తు దక్కనుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన నిషాంత్ తొలి రౌండ్ నుంచి క్రిస్టోస్పై పంచ్‌ల వర్షం కురిపించాడు. రెండో రౌండ్లోనూ చెలరేగిన నిషాంత్ 5-0తో గెలుపొందాడు. తర్వాతి రౌండ్లో అతడు అమెరికాకు చెందిన ఒమరి జోన్స్‌ను ఢీకొట్టనున్నాడు.
Nishant through to the quarter-finals at 1️⃣st Olympic qualifiers 💥🥊
1️⃣ win away from securing the quota 🙌#Olympics #RoadtoParis2024#Paris2024#PunchMeinHaiDum#Boxing pic.twitter.com/kHTr15kTgM
— Boxing Federation (@BFI_official) March 11, 2024
ఈ ఏడాది విశ్వక్రీడలకు నలుగురు భారత బాక్సర్లు అర్హత సాధించారు. మహిళల విభాగంలో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్(50 కిలోలు), లొవ్లీనా బొర్గోహైన్(75 కిలోలు), ప్రీతి(54 కిలోలు) క్వాలిఫై కాగా.. పురుషుల తరఫున ప్రవీణ్ హుడా(57 కిలోలు) ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నాడు. ప్యారిస్ వేదికగా జూన్ నెలలో ఒలింపిక్స్ పోటీలు ఆరంభం కానున్న విషయం తెలిసిందే. వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయర్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన హుసాముద్దీన్ 32వ రౌండ్లోనే కంగుతిన్నాడు. జ్యూడ్ గాల్గర్(ఐర్లాండ్) చేతిలో 0-4తో ఈ ఇందూర్ బాక్సర్ చిత్తుగా ఓడిపోయాడు
నిఖత్ జరీన్