SL vs NZ 2nd Test : గాలే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ (Newzealand) కుప్పకూలింది. సుదీర్ఘ ఫార్మాట్లో శ్రీలంక (Srilanka)పై చెత్త రికార్డు నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్ల వైఫల్యంతో 88 రన్స్‌కే పర్యాటక జట్టు ఆలౌటయ్యింది. 1992 తర్వాత లంకపై మరీ ఇంత తక్కువకు న్యూజిలాండ్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు లంకపై 102కు కివీస్ పది వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే ప్రభాత్ జయసూర్య(6/42), అరంగేట్ర స్పిన్నర్ నిషాన్ పీరిస్(3/33)ల విజృంభించారు. కివీస్ ఆటగాళ్లను వరుసపెట్టి పెవిలియన్ చేర్చి పతనాన్ని శాసించారు.
ఓవైపు అందరూ క్యూ కడుతుంటే.. ఆల్‌రౌండర్ మిచెల్ శాంటన్నర్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే అర్ధం చేసుకోవచ్చు లంక బౌలర్లు ఏ మేర చెలరేగారో. ఫాలో ఆన్‌లోనూ న్యూజిలాండ్ ఆట మారలేదు. 121 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.
Will we have a finish on day 3? New Zealand stumble following a promising stand in their second innings#SLvNZ https://t.co/mD2JJ1pyh5 pic.twitter.com/2a85eIzY8g
— ESPNcricinfo (@ESPNcricinfo) September 28, 2024
శ్రీలంక పర్యటనలో న్యూజిలాండ్ జట్టు తేలిపోతోంది. బ్యాటర్ల వైఫల్యంతో తొలి టెస్టులో కంగుతిన్న కివీస్.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. తొలుత ప్రభాత్ జయసూర్య(6/42), నిషాన్ పీరిస్(3/33)లు చెలరేగడంతో పర్యాటక జట్టు 88 పరుగులకే కుప్పకూలింది. రమేశ్ మెండిస్ స్థానంలో జట్టులోకి వచ్చిన నిషాన్ తన తొలి మ్యాచ్‌లోనూ మ్యాజిక్ చేశాడు. కీలక వికెట్లు తీసి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ నిషాన్ ధాటికి కివీస్ కుదేలైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే(61) పట్టుదలతో అర్ధ సెంచరీతో కొట్టగా.. కేన్ విలియమ్సన్(46) భారీ స్కోర్ చేయలేకపోయాడు.
The misery continues for New Zealand in Galle, who are forced to follow-on trailing by over 500 runs 😲#SLvNZ https://t.co/mD2JJ1pyh5 pic.twitter.com/fVK1JbDvdp
— ESPNcricinfo (@ESPNcricinfo) September 28, 2024
తొలి టెస్టులో చివరిదాకా పోరాడిన రచిన్ రవీంద్ర(12)ను సైతం బౌల్డ్ చేసిన నిషాన్ ఆతిథ్య జట్టును విజయానికి మరింత దగ్గర చేశాడు. 121 పరుగులకే టాప్ ఆటగాళ్లంతా డగౌట్‌కు చేరిన వేళ టామ్ బ్లండెల్(26 నాటౌట్), గ్లెన్ ఫిలిఫ్స్(10)లు ఆచితూచి ఆడుతున్నారు. వీళ్లు ఇప్పటికైతే ఆరో వికెట్‌కు 36 రన్స్ జోడించారు. అయినా న్యూజిలాండ్ ఇంకా 357 పరుగులు వెనకబడి ఉంది. చూస్తుంటే.. మూడో రోజు ఆట ముగిసే లోపు లేదా నాలుగో రోజు తొలి సెషన్లోనే లంక జయభేరి మోగించడం ఖాయమనిపిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 602-5 వద్ద డిక్లేర్ చేసింది. కమిందు మెండిస్(), కుశాల్ మెండిస్(), దినేశ్ చండిమల్()లు సెంచరీలతో విరుచుకుపడగా తొలి రోజే లంక టెస్టుపై పట్టు బిగించింది.