గాజా: లెబనాన్‌లోని హిజ్బొల్లా నేత హస్సన్ నస్రల్లాను ఇజ్రాయిల్ దళాలు హతమార్చాయి. బీరుట్‌పై శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో అతను మృతిచెందినట్లు ఇవాళ ఇజ్రాయిల్ మిలిటరీ ప్రకటించింది. అయితే నస్రల్లా టార్గెట్‌తో చేపట్టిన ఆపరేషన్‌కు ‘న్యూ ఆర్డర్’ అని పేరు పెట్టారు. బీరుట్‌పై జరిగిన దాడులకు చెందిన ఫోటోలను ఇజ్రాయిల్ వైమానిక దళం రిలీజ్ చేసింది. శుక్రవారం రాత్రి నుంచి హిజ్బొల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా ఆచూకీ తెలియడంలేదని, అతనితో కాంటాక్ట్ తెగిపోయినట్లు ఆ గ్రూపునకు చెందిన కొందరు వెల్లడించారు. హిజ్బొల్లా అధికారి పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
తమ దేశాన్ని, పౌరుల్ని ఎవరు బెదిరించినా, వాళ్లను ఇజ్రాయిల్ వదిలి పెట్టదని ఐడీఎప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెజ్రీ హలేవీ తెలిపారు. శుక్రవారం జరిపిన దాడిలో .. అంండర్గ్రౌండ్ బిల్డింగ్‌ల్లో దాచిన డజన్ల కొద్దీ యాంటీ షిప్ మిస్సైళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. చైనాకు చెందిన సీ-704, సీ802 మిస్సైళ్లు హిజ్బొల్లా వద్ద ఉన్నట్లు గుర్తించామని ఇజ్రాయిల్ తెలిపింది. 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఇరాన్ క్షిపణి గదార్ కూడా హిజ్బొల్లా వద్ద ఉన్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ తెలిపింది.
హిజ్బొల్లాకు చెందిన ఓ యూనిట్.. ఆ క్షిపణులను స్టోర్ చేసి ఆపరేట్ చేస్తున్నట్లు తెలిసింది. ఫైటర్ విమానాలు చేపట్టిన ఆపరేషన్‌కు చెందిన వీడియోలను రిలీజ్ చేశారు.