IND vs SA : వన్డే సిరీస్ విజేత భారతజట్టుకు కటక్‌లో తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. టీ20ల్లో విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్(4) మరోసారి నిరాశపరిచాడు. లుంగి ఎంగిడి ఓవర్లో బౌండరీ బాదిన గిల్.. ఆ తర్వాత బంతికే వెనుదిరిగాడు. కాసేపటికే ఫోర్, సిక్సర్‌తో అలరించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12) సైతం ఎంగిడి బౌలింగ్‌లోనే వికెట్ సమర్పించుకున్నాడు. కీలక వికెట్లు పడిన వేళ ఓపెనర్ అభిషేక్ శర్మ(9నాటౌట్), తిలక్ వర్మ(11 నాటౌట్) భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నారు. పవర్ ప్లేలో భారత్ స్కోర్.. 40-2.
టాస్ ఓడిన భారత జట్టుకు తొలి టీ20లో శుభారంభం దక్కలేదు. మెడ గాయం నుంచి కోలుకుని.. ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్(4) మళ్లీ విఫలమయ్యాడు. ఎంగిడి వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో బౌండరీ కొట్టిన గిల్.. ఆ తర్వాత టైమింగ్ కుదరక 30 యార్డ్ సైకిల్లోనే క్యాచ్ ఇచ్చేసి వెళ్లాడు. వికెటల్ పడగానే వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (12) టైమ్ తీసుకుని తన స్టయిల్ ఆట మొదలు పెట్టాడు. ఎంగిడి ఓవర్లో లెగ్ సైడ్ బౌండరీ, సిక్సర్ బాదాడు. నాలుగో బంతికి అదేసాట్ ఆడబోయి మర్క్రమ్ చేతికి చిక్కాడు. దాంతో.. 17కే రెండు వికెట్లు పడ్డాయి.