Newzealand Cricket : భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్‌కు పెద్ద షాక్ తగిలింది. వన్డే సిరీస్ మధ్యలోనే స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కేర్ (Amelia Kerr) స్వదేశానికి వెళ్లనుంది. రెండో వన్డేకు ముందు ఆమె జట్టుకు దూరమవ్వడం కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బే. గాయం కారణంగా అమేలియా మూడు వారాలు విశ్రాంతి తీసుకోనుంది. బ్యాటర్‌గా, బౌలర్‌గా చెలరేగే ఆమె సిరీస్‌లో కీలకమైన మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో సోఫీ డెవినె బృందం ఒకింత ఆందోళనతో ఉంది.
అసలేం జరిగిందంటే.. తొలి వన్డే సమయంలో అమేలియా ఎడమ కాలి తొడ కండరాల గాయంతో బాధ పడింది. మ్యాచ్ అనంతరం స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కోలుకునేందుకు మూడు వారాలు పడుతుందని చెప్పారు. అందువల్ల అమేలియాకు కివీస్ బోర్డు విశ్రాంతి ఇవ్వనుంది. ఈ విషయాన్ని శనివారం న్యూజిలాండ్ యాజమాన్యం వెల్లడించింది.
A grade one quadriceps tear is set to keep Amelia Kerr out of action for at least three weeks 🤕
Read more: https://t.co/yny2pkf3bD pic.twitter.com/XAotMW991l
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024
‘అమేలియాకు గాయం కావడంతో మేమంతా బాధతో ఉన్నాం. అయితే.. ప్రతి క్రికెటర్‌కు గాయాలు సవాల్ విసురుతాయి. వన్డే సిరీస్‌కు దూరం కావడం వల్ల అమేలియా ఎంతో నిరాశ చెంది ఉంటుంది. ఆమె జట్టులో ఎంత కీలకమైన ప్లేయర్ అనేది అందరికీ తెలుసు. కచ్చితంగా ఆమె సేవల్ని మేము కోల్పోతాం. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని హెడ్‌కోచ్ బెన్ సాయర్ వెల్లడించారు.
పొట్టి వరల్డ్ కప్ చాంపియన్ న్యూజిలాండ్ మహిళల జట్టుకు టీమిండియా షాకిచ్చింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లను కట్టడి చేసి 59 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. సిరీస్‌లో కీలకమై రెండో వన్డే అక్టోబర్ 27, ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది.
A winning start to the ODI series in Ahmedabad 🤩#TeamIndia complete a 59 runs victory over New Zealand in the 1st #INDvNZ ODI and take a 1-0 lead 👏👏
Scorecard – https://t.co/VGGT7lSS13@IDFCFIRSTBank pic.twitter.com/QUNOirPjbh
— BCCI Women (@BCCIWomen) October 24, 2024
తొలి మ్యాచ్‌లో విజయోత్సాహంతో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన ఇక్కడే సిరీస్ పట్టేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరల్డ్ చాంపియన్‌గా మొదటి సిరీస్ చేజారనివ్వకూడదని సోఫీ డెవినె టీమ్ భావిస్తోంది. దాంతో, ఇరుజట్ల మధ్య ఆదివారం తగ్గపోరు అభిమానులను అలరించనుంది.