Mazaka Movie | గతేడాది మాస్ మహారాజ రవితేజతో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఈ సినిమా అనంతరం త్రినాధరావు సందీప్ కిషన్‌తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మజాకా అంటూ వస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్‌తో పాటు ఊరుపేరు భైరవకోన, రాయన్ సినిమాలతో హిట్లు అందుకున్న సందీప్ మజాకాతో కూడా మరో హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా వైజాగ్‌లో జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో సందీప్ సరసన కథానాయికగా పెళ్లి చూపులు, స్వాగ్ ఫేం రీతు వర్మ నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో రీతు వర్మ జాయిన్ అయినట్లు బీటీఎస్ వీడియోను సందీప్ కిషస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
లవ్ & కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా.. 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో రావు రమేశ్, ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూ. 23 కోట్లకు అమ్ముడుపోయాయి.
Welcome the super talented @riturv , #VarmaGaru on board
As our Leading Lady 😍❤️🔥The fresh pairing of People’s Star @sundeepkishan and #RituVarma is Heart of #MAZAKA ❤️ pic.twitter.com/fbUOvaTKE8
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2024