Dulquer Salmaan | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). గత ఏడాది ‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌తో పాటు పాటలు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా రౌడి హీరో విజయ్ దేవరకొండతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుకాబోతున్నారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
The ROWDY Storm Alert! 🚨
An absolute stunner and a diligent performer, our Rowdy @TheDeverakonda will be gracing the Pre-release event of our #LuckyBaskhar along with our darling director #Trivikram garu. 🤩❤️🔥
📍TOMORROW @ JRC Convention Film Nagar, Hyderabad from 6:00 PM… pic.twitter.com/8aqr2M68Bq
— Sithara Entertainments (@SitharaEnts) October 26, 2024