Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలట.. అవేంటో తెలుసా..?
Health tips : మనం ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థంలో ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో పోషకాలుంటాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఎక్కువ ఆరోగ్య ప్రయోజానాలున్న పోషకాలుంటే.. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో తక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్న పోషకాలుంటాయి. ఇక అధిక ప్రయోజనంగల పోషకాలున్న ఆహార పదార్థాల విషయానికి వస్తే.. కోడిగుడ్డు ముందు వరుసలో ఉంటుంది. మనం రోజుకొక ఉడుకబెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుంటాయి. మరి అవేంటో తెలుసుకుందామా..
Health tips : మనం ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థంలో ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో పోషకాలుంటాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఎక్కువ ఆరోగ్య ప్రయోజానాలున్న పోషకాలుంటే.. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో తక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్న పోషకాలుంటాయి. ఇక అధిక ప్రయోజనంగల పోషకాలున్న ఆహార పదార్థాల విషయానికి వస్తే.. కోడిగుడ్డు ముందు వరుసలో ఉంటుంది. మనం రోజుకొక ఉడుకబెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుంటాయి. మరి అవేంటో తెలుసుకుందామా..
ప్రయోజనాలు..
1. కోడిగుడ్ల ద్వారా శరీరానికి రకరకాల పోషకాలు లభిస్తాయి. శరీరానికి కావాల్సిన సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అదేవిధంగా పొటాషియం, విటమిన్-A, కాల్షియం, ఐరన్, విటమిన్-D, విటమిన్ B6, విటమిన్ B12, మెగ్నీషియం గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి.
2. కోడిగుడ్డు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డు సొనలో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
3. కోడిగుడ్డులోని ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్ గర్భిణులు, బాలింతలకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు ఉడుకబెట్టిన కోడిగుడ్డు తీసుకోవాలి.
4. గుడ్డులో ఉండే పోషక విలువలవల్ల ఇది మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా నిరోధించడంలో కూడా తోడ్పడుతుంది.
5. జట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకూ గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డులోని విటమిన్-A కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
6. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండటంవల్ల అవి ఎముకలు గట్టిపడటానికి తోడ్పడుతాయి.
7. నరాల బలహీనత ఉన్నవారు కూడా ప్రతిరోజూ క్రమం తప్పకుండా గుడ్డును తీసుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుంది. అంతేగాక గుండె రక్తనాళాలకు కూడా కోడిగుడ్డుతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

