డునెడిన్ (న్యూజిలాండ్): ఓపెనర్ ఫిన్ అలెన్ (62 బంతుల్లో 137; 5 ఫోర్లు, 16 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో.. న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌పై 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడోటీ20లో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తుచేసింది.
పొట్టి ఫార్మాట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన బ్యాటర్‌గా హజ్రతుల్లా జజాయ్‌ను అలెన్ సమం చేశాడు. అలెన్ ధాటికి తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 224 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గానూ అలెన్ నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులకు పరిమితమైంది. బాబర్ ఆజమ్ (58) టాప్ స్కోరర్.