మౌంట్ మౌంగనుయి: ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచి 1-0తో ముందంజ వేసింది. తొలుత కెప్టెన్ హ్యారీ బ్రూక్(101 బంతుల్లో 135, 9ఫోర్లు, 11 సిక్స్‌లు) వీరొచిత సెంచరీతో ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 223 పరుగులకు పరిమితమైంది. నాలుగు పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన బ్రూక్..కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు.
తన దూకుడైన బ్యాటింగ్‌తో 9 ఫోర్లు, 11 భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. బ్రూక్ తర్వాత జెమీ ఓవర్టన్(46)దే టాప్ స్కోర్ కాగా మిగతావారు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఫౌల్క్స్ (4/41), డఫీ (3/55) ఇంగ్లండ్ పతనంలో కీలకమయ్యారు. నిర్దేశిత లక్ష్యాన్ని కివీస్ 36.4 ఓవర్లలో 224/6 స్కోరు చేసింది. డారిల్ మిచెల్ (78 నాటౌట్), మిచెల్ బ్రేస్‌వెల్(51) అర్ధసెంచరీల కివీస్‌ను గెలిపించారు. బ్రైడన్ కార్స్ (3/45) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.