హరారే: జింబాబ్వే వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన కివీస్.. శుక్రవారం హరారేలో జరిగిన తమ రెండో పోరులో జింబాబ్వేపై 8 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.
మదెవెరె (36) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో మాథ్యూ హెన్రీ (3/26) మూడు వికెట్లు తీయగా మిల్నె, కెప్టెన్ శాంట్నర్, బ్రాస్‌వెల్, రచిన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో కివీస్.. 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. డెవాన్ కాన్వే (59 నాటౌట్), రచిన్ (30) దూకుడుగా ఆడారు.