ట్రెంట్‌బ్రిడ్జ్ : రెండున్నరేండ్ల క్రితం భారత్‌కు సొంతగడ్డపై చుక్కలు చూపించి టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్.. తాజాగా ఇంగ్లండ్‌నూ వారి స్వదేశంలోనే దెబ్బకొట్టి చరిత్రాత్మక విజయం సాధించింది.
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా సిరీస్ విజేతను నిర్ణయించేందుకు జరిగిన మూడో టెస్టులో కివీస్.. ఆట చివరి రోజు, సోమవారం ఆతిథ్య జట్టును 160 పరుగుల తేడాతో చిత్తుచేసి సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 373 పరుగుల ఛేదనలో ఇంగ్లిష్ జట్టు.. 212 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ తన కెరీర్‌ను ఓటమితో ముగించాడు.