ఆక్లాండ్: దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మూడో టీ20 పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ టామ్ లాథమ్(55 బంతుల్లో 63 నాటౌట్, 7ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు.
సఫారీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. సింపాల (1/26), మహారాజ్ (1/30) ఒక్కో వికెట్ తీశారు. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 136/9 స్కోరు చేసింది. జెమీసన్ (2/42), సాంట్నర్ (2/21), సీయర్స్ (2/27) ధాటికి సఫారీ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. మోకెనా (26 నాటౌట్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఫెర్గుసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.