ODI World Cup 2023 | నెదర్లాండ్స్ జట్టు వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. స్పెషల్ ఏముందంటే..?
ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్(Netherlands) జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ దేశ క్రికెట్ బోర్డు ఈరోజు ప్రపంచ కప్ జెర్సీలను విడుదల చేసింది. ఈసారి ప్రత్యేకంగా రివర్సిబుల్ బకెట్ టోపీ(Reversible Bucket Hat)ని తీసుకొచ్చారు. ఈ టోపీ కాషాయం (Orange), నీలం(Navy Blue) రంగులో...
ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్(Netherlands) జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ దేశ క్రికెట్ బోర్డు ఈరోజు ప్రపంచ కప్ జెర్సీలను విడుదల చేసింది. ఈసారి ప్రత్యేకంగా రివర్సిబుల్ బకెట్ టోపీ(Reversible Bucket Hat)ని తీసుకొచ్చారు. ఈ టోపీ కాషాయం (Orange), నీలం(Navy Blue) రంగులో చూడముచ్చటగా ఉంది. ఈ క్యాప్ నెదర్లాండ్స్ వరల్డ్ కప్ జర్నీకి ప్రతీకగా నిలువనుంది. పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన డచ్ జట్టు ఈ ఐదో మోగా టోర్నీలో ఆడడం ఇది ఐదోసారి.
జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(World Cup Qualifiers) లో నెదర్లాండ్స్ అదరగొట్టింది. మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై అద్భుత విజయంతో ఈ ఏడాది ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో డచ్ జట్టుకుస్కాట్ ఎడ్వర్డ్స్(Scott Edwards) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
A closer look at our new threads and those super cool buckets hats! 😉#CWC23 pic.twitter.com/L0ozJr9nvj
— Cricket🏏Netherlands (@KNCBcricket) September 22, 2023
ఆ జట్టు 15 మంది బృందంలో తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు(Teja Nidamanuru) చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు అనుభవజ్ఞులైన రొఎల్ఫ్ వాన్ డెర్ మెర్వే(Roelof van der Merwe), కొలిన్ అక్రెమన్(Colin Ackermann)లు మళ్లీ జట్టులోకి వచ్చారు. భారత గడ్డపై అక్టోబర్ 5న ప్రపంచ కప్ మొదలవ్వనుంది. అక్టోబర్ 6న డచ్ జట్టు, పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
నెదర్లాండ్స్ వరల్డ్ కప్ స్క్వాడ్ : స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడె, విక్రం సింగ్, తేజ నిడమనూరు, పౌల్ వాన్ మీకెరెన్, వాన్ డెర్ మెర్వే, కొలిన్ అక్రెమన్, లొగాన్ వాన్ బీక్, అర్యన్ డట్, రియాన్ క్లెయిన్, వెస్లే బరేసి, సకిబ్ జుల్ఫికర్, షరిజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెంచెట్.
ఇవి కూడా చదవండి
Pragyan Ojha | ఐపీఎల్ పాలక మండలికి మాజీ స్పిన్నర్ గుడ్ బై..!
Asian Games: అరుణాచల్ అథ్లెట్లకు వీసా నిరాకరణ.. ఆసియా క్రీడలకు వెళ్లడంలేదన్న కేంద్ర మంత్రి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

