Asian Games: అరుణాచల్ అథ్లెట్లకు వీసా నిరాకరణ.. ఆసియా క్రీడలకు వెళ్లడంలేదన్న కేంద్ర మంత్రి
Anurag Thakur: అరుణాచల్‌కు చెందిన వూషు ఫైటర్లకు వీసా ఇచ్చేందుకు చైనా నిరాకరించిన నేపథ్యంలో.. ఆ దేశంలో జరుగుతున్న ఆసియా క్రీడలకు వెళ్లడం లేదని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్లకు వీసా ఇచ్చేందుకు చైనా నిరాకరించింది. ఇవాళ్టి నుంచి హాంగ్జూలో ప్రారంభం అవుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games) పాల్గొనేందుకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్లు ఎంపిక అయ్యారు. అయితే ఆ క్రీడాకారులకు చైనా వీసాలు జారీ చేయలేదు. ఆతిథ్య దేశం నుంచి క్లియరెన్స్ దక్కకపోవడం వల్ల ముగ్గురు వూషు అథ్లెట్లు ఆసియా క్రీడల్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఆ క్రీడాకారులు తమ అక్రెడిటేషన్ కార్డులను డౌన్లోడ్ చేసుకోలేదని, దాని వల్లే వాళ్లకు వీసా దక్కలేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.
#WATCH | Coimbatore, Tamil Nadu: Union Minister Anurag Thakur says, “When they (China) refused visa to three of our athletes (for Asian Games) who hail from the state of Arunachal Pradesh. I decided that I will not go and participate in the Asian Games because Arunachal Pradesh… pic.twitter.com/VYkKHM9cgH
— ANI (@ANI) September 23, 2023
వూషు లేదా కింగ్ ఫూ క్రీడకు చెందిన ఇతర భారతీయ అథ్లెట్లు ఇప్పటికే హాంగ్జూ చేరుకున్నారు. జూలైలో చెంగ్డూలో వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ జరిగాయి. ఆ సమయంలోనూ ఈ ముగ్గురు అథ్లెట్లకు ఆ దేశం వీసాలు ఇవ్వలేదు. ఇటీవల రిలీజ్ చేసిన కొత్త మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా తమ భూభాగంగా చైనా చూపించుకున్నది.
ఈ వివాదం నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన అథ్లెట్లకు వీసా జారీ చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే అరుణాచల్ అథ్లెట్లకు వీసా ఇవ్వని కారణంగా ఆ దేశానికి వెళ్లడం లేదని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్ భూభాగమని అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

