Billboard | భీకర గాలులు, అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) సోమవారం చిగురుటాకులా వణికిపోయిన విషయం తెలిసిందే. గాలుల ధాటికి ఘాట్కోపర్ (Ghatkopar) ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ (Billboard Crashes Down) పెట్రోల్ పంప్‌పై కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారుగా 74 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇది జరిగిన మూడు రోజులకి హోర్డింగ్ కూలిన ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 16 సెకండ్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, పెట్రోల్ పంప్ సమీపంలో సుమారు 100 అడుగుల ఎత్తయిన భారీ హోర్డింగ్ ఏర్పాటుచేశారు. ఆ హోర్డింగ్‌కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటుచేశారని బీఎంసీ అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో మొత్తం నాలుగు హోర్డింగ్‌లు ఏర్పాటు చేయగా.. వాటిలో ఒకటి కుప్పకూలిపోయింది. హోర్డింగ్ ఏర్పాటు చేసిన యాడ్ ఏజెన్సీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
Mumbai Hoarding Collapse
– Rescue operation concludes in Ghatkopar
– The ‘killer’ billboard has claimed at least 16 lives
– Main accused #BhaveshBhinde still at large
– #BMC removes unauthorised hoardings from #Malad and #Ghatkopar | @NivedhanaPrabhu pic.twitter.com/MsJU0brUyo
— Mirror Now (@MirrorNow) May 16, 2024
Also Read..
Shyam Rangeela | వారణాసిలో మోదీపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు ఝలక్ ఇచ్చిన అధికారులు
Naresh Goyal | జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ భార్య కన్నుమూత