ODI World Cup 2023 : వరల్డ్ కప్ 34 వ లీగ్ దశ మ్యాచ్‌లో నెదర్లాండ్స్, అఫ్గానిస్థాన్ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ తీసుకుంది. మెగా టోర్నీలో సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లకు షాకిచ్చిన ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్, పాకిస్థాన్‌లపై అద్భుత విజయంతో సెమీస్ రేసులో నిలిచిన అఫ్గన్‌కు చెక్ పెట్టాలని డచ్ జట్టు అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో కాబూలీలు నూర్ అహ్మద్‌తో కలిపి
నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నారు.
నెదర్లాండ్స్ : మాక్స్ ఓడౌడ్, వెస్లే బరేసీ, కొలిన్ అకర్మన్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్, వికెట్‌కీపర్), బాస్ డీ లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లొగన్ వాన్ బ్రీక్, రియాన్ ఖ్లేన్, అర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.
అఫ్గానిస్థాన్ : రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రం అలిఖిల్(వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారుఖీ.