Salaar | టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం సలార్ (Salaar). ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. సలార్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్లో గూస్బంప్స్ తెప్పించే విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్న సలార్ రెండుపార్టులుగా వస్తుండగా.. Salaar Part-1 Ceasefireను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
సలార్ విడుదలకు ఇంకా 50 రోజులుంది.. రోజురోజుకీ ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాలో హాలీవుడ్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ హైలెట్‌గా నిలువబోతుందట. జీపులు, ట్యాంకులు, ట్రక్కులతో 750 రకాల వాహనాలను ఈ సీక్వెన్స్‌లో వాడారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంటే హాలీవుడ్ సినిమాల్లో వచ్చే గ్రాండ్ వార్ సీక్వెన్స్‌ను తలపించేలా ఈ సన్నివేశాలుండబోతున్నాయని చెప్పకనే చెబుతున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్ర పోషిస్తున్నాడు. సలార్‌లో పృథ్విరాజ్ సుకుమారన్ పోషిస్తున్న వరదరాజ మన్నార్ ది కింగ్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. నుదుటన తిలకం, మెడ చుట్టూ స్కార్ప్ వేసుకొని స్టన్నింగ్ లుక్‌తో వరదరాజ మన్నార్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ అదిరిపోయే లుక్‌తో సలార్‌పై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న సలార్ టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్న సలార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ టీం సలార్ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు యూనిక్ ప్రమోషనల్ క్యాంపెయిన్స్‌కు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చాలా స్పెషల్‌గా నిలిచిపోయేలా నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
సలార్ టీజర్..