Sybrand Engelbrecht : పొట్టి వరల్డ్ కప్‌లో విఫలమైన క్రికెటర్లు కొందరు తమ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెడుతున్నారు. నమీబియా స్టార్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ (David Wiese) ఆటకు గుడ్ బై చెప్పి ఒక్క రోజైనా గడువకముందే.. నెదర్లాండ్స్ (Netherlands) ప్రధాన ఆటగాడు క్రికెట్ నుంచి వైదొలిగాడు. సోమవారం డచ్ స్టార్ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (Sybrand Engelbrecht) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
టీ20 ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ తరఫున అత్యధిక రన్స్ చేసిన సైబ్రాండ్ సంచలన నిర్ణయంతో ఆశ్చర్యపరిచాడు. మెగా టోర్నీల అతడు 24.50 సగటుతో 98 రన్స్ కొట్టాడు. అయితే.. చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక (Srilanka) 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఆ ఓటమి బాధలోనే సైబ్రాండ్ ఆటకు అల్విదా పలికాడు.
Go steady, SAE 🖖#Nordek pic.twitter.com/gQ0WIzC1ru
— Cricket🏏Netherlands (@KNCBcricket) June 17, 2024
దక్షిణాఫ్రికాలో పుట్టిన సైబ్రాండ్ 2023లో నెదర్లాండ్స్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. తన ఏడాది కెరీర్లో అతడు 12 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 35 ఏండ్ల సైబ్రాండ్ టీ20 ప్రపంచ కప్‌లో మెరిశాడు. డచ్ జట్టు స్వల్ప తేడాతో ఓడిన రెండు మ్యాచుల్లోనూ టాప్ స్కోరర్ అతడే. దక్షిణాఫ్రికాపై 40, బంగ్లాదేశ్‌పై 30 రన్స్‌తో ఆకట్టుకున్నాడు.