Amit Shah : మణిపూర్ (Manipur) లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సోమవారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం (High level meeting) నిర్వహించారు. ఢిల్లీలోని హోంశాఖ ( Ministry of Home Affairs) కార్యాలయం నార్త్ బ్లాక్లో జరిగిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మణిపూర్లో ప్రస్తుత పరిస్థితి, ఈ పరిస్థితిని ఇంకా మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, కాబోయే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, మణిపూర్ భద్రతా సలహారు కుల్దీప్ సింగ్, మణిపూర్ చీఫ్ సెక్రెటరీ వినీత్ జోషి, మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్, అస్సాం రైఫిల్స్ డీజీ ప్రదీప్ చంద్రన్ నాయర్ ఈ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు. ఆదివారం జమ్ముకశ్మీర్లో భద్రతా పరిస్థితిపై, అమర్నాథ్ యాత్రపై కూడా అమిత్ షా ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా హాజరయ్యారు.
#WATCH | Union Home Minister Amit Shah chairs a high-level meeting to review the security situation in Manipur.
Union Home Secretary Ajay Bhalla, Intelligence Bureau Chief Tapan Deka, Army Chief General Manoj Pande, Army Chief (Designate) Lt General Upendra Dwivedi, GoC Three… pic.twitter.com/aVaw0im3FV
— ANI (@ANI) June 17, 2024