T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌ను ఓటమితో ఆరంభించిన నేపాల్ (Nepal) జట్టుకు గుడ్‌న్యూస్. ఆ టీమ్ స్టార్ స్పిన్నర్ సందీప్ లమిచ్చానే(Sandeep Lamichhane)కు ఎట్టకేలకు వీసా లభించింది. ఈ విషయాన్ని సందీప్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. వెస్టిండీస్‌లో చివరి రెండు లీగ్ మ్యాచ్‌లకు నేను జట్టులో కలుస్తున్నా. వరల్డ్ కప్ ఆడాలనే నా కలను నెరవేర్చుకోవడంతో పాటు క్రికెట్ ప్రేమికుల కలను నిజం చేయబోతున్నా అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
నేపాల్ జట్టులో కీలక బౌలర్ అయిన సందీప్‌ను ఆ దేశ కోర్టు అత్యాచార కేసులో నిర్దోషిగా ఈ మధ్యే తేల్చింది. వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించిన నేపాల్ జట్టు షెడ్యూల్ ప్రకారం యూఎస్ ఏలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయినా సరే ఖాట్మండ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం రేపిస్ట్ ముద్ర ఉన్న సందీప్ వీసాను నిరభ్యంతరంగా తోసిపుచ్చింది.
Namaste 🙏
Hello from West Indies.🏝️❤️ pic.twitter.com/7w6y6lEslO— Sandeep Lamichhane (@Sandeep25) June 10, 2024
అయితే.. చివరకు వెస్టిండీస్ ఈ లెగ్ స్పిన్నర్‌కు వీసా మంజూరు చేసింది. దాంతోతో సందీప్ జూన్ 10న జట్టుతో కలిశాడు. 11వ తేదీన శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే చాన్స్ ఉంది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిన ఆసియా జట్టు ఈ పోరులో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.
నేపాల్ జట్టు వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించడంలో లెగ్ స్పిన్నర్ అయిన సందీప్ కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. యూఏఈతో జరిగిన సెమీఫైనల్లో సందీప్ సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఈ లెగీ 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు.