న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కార్యాలయం ప్రజల కేంద్రంగా ఉండాలని నమ్ముతున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. మోదీ కేంద్రీకృతమై పీఎంవో ఉండకూడాదన్నారు. మూడవసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ.. ఇవాళ పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పీఎంవో సిబ్బందితో మాట్లాడారు. 2014 ముందకు పీఎంవో కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేది, కానీ అది ప్రజలు పీఎంవోగా ఉండాలని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమకు ఒకటే లక్ష్యం ఉందని, ఈ దేశమే ప్రప్రథమం అన్నారు. ఒకే స్పూర్తితో పనిచేస్తున్నామని, 2047 నాటికి వికసిత భారత్ నిర్మించాలన్నారు. తన జీవితంలోని ప్రతి క్షణం దేశం కోసమే అని ప్రధాని మోదీ పీఎంవో సిబ్బందితో పేర్కొన్నారు.
इच्छा + स्थिरता = संकल्प
संकल्प + परिश्रम = सिद्धि pic.twitter.com/ikAZ6lpgtd— Narendra Modi (@narendramodi) June 10, 2024