నేపాల్ నయా చరిత్ర.. స్కాట్లాండ్పై ఘన విజయం
క్రికెట్ పసికూన నేపాల్ కొత్త చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
- టీ20 ప్రపంచకప్‌లో తొలి గెలుపు
ముంబై: క్రికెట్ పసికూన నేపాల్ కొత్త చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తమ ఆఖరి గ్రూపు పోరులో స్కాట్లాండ్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాటిష్ టీమ్‌పై సమష్టి ప్రదర్శనతో సత్తాచాటారు. వందలాది మంది తమ దేశ క్రికెట్ అభిమానుల సమక్షంలో నేపాల్ అద్భుత ప్రదర్శనతో కదంతొక్కింది. తొలుత సోంపాల్(3/25), నందన్యాదవ్(2/34) ధాటికి స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 170/7 స్కోరు చేసింది.
ఓపెనర్ మిచెల్ జోన్స్(71) ధనాధన అర్ధసెంచరీతో చెలరేగగా, మిగతావారు అంతగా ఆకట్టుకోలేకపోయారు. లక్ష్యఛేదనలో నేపాల్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. దీపేంద్రసింగ్ ఐరీ(23 బంతుల్లో 50 నాటౌట్, 4ఫోర్లు, 3సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్లు కుశాల్(43), ఆసిఫ్ షేక్(33) మెరుగైన శుభారంభాన్ని అందించారు. ఆఖర్లో గుల్షన్(24 నాటౌట్)తో కలిసి ఐరీ..జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఐరీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ICC
- Nepal
- Scotland
- T20 World Cup
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

