Asia Cup 2023 | శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ లో ఇండియా-నేపాల్ మధ్య మ్యాచ్ జరుగుతుండగానే వర్షం కురవడంతో మధ్యలోనే మ్యాచ్ నిలిపివేశారు. భారత్ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రెండు ఓవర్లకే వర్షం మొదలైంది. అప్పటికి ఓపెనర్లు రోహిత్ శర్మ 4, శుభ్ మన్ గిల్ 12 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. వర్షం నిలిచిపోవడంతో 10.15 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ను 23 ఓవర్లకు కుదించారు. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ విజయ లక్ష్యం 145 పరుగులుగా నిర్ణయించారు.