T20 World Cup | ఖాట్మండు: వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌నకు ఆసియా నుంచి నేపాల్, ఒమన్ అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్ చేరడం ద్వారా ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచకప్ బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్నాయి.
శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఒమన్ 10 వికెట్ల తేడాతో బహ్రెయిన్‌ను మట్టికరిపిస్తే.. నేపాల్ 8 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తుచేసి ముందంజ వేసింది.