Neeraj Chopra : ఈ సీజన్లో రికార్డు విజయాలు సాధిస్తున్న ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) మళ్లీ వరల్డ్ అథ్లెటిక్స్‌లో అగ్రస్థానానికి చేరువయ్యాడు. పారిస్ డైమండ్ లీగ్, ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్స్ టోర్నీలో విజేతగా నిలిచిన చోప్రా నంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం టాప్ ర్యాంకర్‌గా కొనసాగిన బడిసె వీరుడు.. ఈ ఏడాది సూపర్ ఫామ్‌తో అగ్రపీఠం సాధించాడు. దాంతో, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్‌ను రెండోస్థానానికి పడిపోయాడు.
ప్రస్తుతం భారత బడిసె వీరుడి ఖాతాలో 1,445 పాయింట్లు ఉండగా.. పీటర్స్‌కు 1,431 పాయింట్లు ఉన్నాయి. దోహా డైమండ్ లీగ్‌లో చోప్రాను దాటేసి ఛాంపియన్‌గా అవతరించిన జులియన్ వెబర్(Julian Weber) మూడో స్థానంలో, పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 1,370 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు బద్ధలు కొడుతున్న నీరజ్ చోప్రా విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోయేలా చేస్తున్నాడు. టోక్యో విశ్వ క్రీడల్లో గోల్డ్ మెడల్‌తో చరిత్ర సృష్టించిన అతడు.. పారిస్ ఒలింపిక్స్‌లో రజతంతో మెరిశాడు. వరస ఒలింపిక్ పతకాలతో యావత్ భారతావని గర్వపడేలా చేసిన నీరజ్ ఈ ఏడాది కూడా అదరగొడుతున్నాడు.
దక్షిణాఫ్రికాలోని పాట్చ్ ఇన్విటేషన్లో విజేతగా నిలిచిన చోప్రా.. అనతరం దోహా డైమండ్ లీగ్‌లో ఈటెను 90 మీటర్ల దూరం విసిరాడు. కానీ, రెండో స్థానంతోనే సరిపెట్టుకున్న అతడు.. పారిస్ డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా అవతరించాడు. అనంతరం ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్స్లోనూ 90 మీటర్ల మార్క్ అందుకోకున్నా సరే టైటిల్ గెలుపొందాడు. ఫైనల్లో 85.29 మీటర్ల దూరంతో నీరజ్ విజయం సాధించాడు.
INDIA’S NEERAJ CHOPRA WINS THE PRESTIGIOUS OSTRAVA GOLDEN SPIKE 2025 🏆 https://t.co/E9HHYlYDim pic.twitter.com/k28zwSPHUZ
— The Khel India (@TheKhelIndia) June 24, 2025