న్యూఢిల్లీ : బ్రస్సెల్స్(బెల్జియం) వేదికగా ఈనెల 22న జరుగనున్న డైమండ్ లీగ్‌కు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్‌చోప్రా దూరమయ్యాడు. ఇప్పటికే జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన నీరజ్..బ్రస్సెల్స్‌లో బరిలోకి దిగడం లేదు. ఈ ఏడాది దోహా, పారిస్ డైమంగ్ లీగ్ పోటీల్లో పాల్గొన్న నీరజ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ముఖ్యంగా మే నెలలో దోహాలో జరిగిన టోర్నీలో 90.23మీటర్ల మార్క్‌తో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత జూన్‌లో పారిస్‌లోనూ 88.16మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.