Neeraj Copra : జావెలిన్ త్రోతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నీరజ్ చోప్రా (Neeraj Copra) తన కలను నిజం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన బడిసె వీరుడు.. అథ్లెటిక్స్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడు. మరికొంతమంది జావెలిన్ యోధులను తయారుచేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. జూలై 5న బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో నీరజ్ చోప్రా క్లాసిక్ తొలి ఎడిషన్ ప్రారంభం కానున్న నేపథ్యలో అతడు మీడియాతో మట్లాడుతూ.. అథ్లెటిక్స్‌లో భారత్ గొప్పగా రాణించాలని ఆకాంక్షించాడు.
‘ఇదంతా కలలా అనిపిస్తోంది. విశ్వవేదికలపై పతకాలు సాధించడంతోనే సంతృప్తి చెందే రకం కాదు నేను. దేశం కోసం ఏదైనా చేయాలనే తపన కలిగిన మనిషిని. అందుకే భారత అథ్లెట్లకు నా వంతుగా సాయం చేయాలనుకున్నా. మనదేశ అథ్లెటిక్స్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ నా పేరుతో నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నీ ఆరంభిస్తున్నాను. ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహా క్రతువులో నాకు ప్రజలు, ప్రభుత్వం మద్దతుగా నిలుస్తున్నారు.
An honour, a gesture, a moment. ✨
Baptist Hospital – our Official Healthcare Partner shares a token of pride with Neeraj Chopra as the Neeraj Chopra Classic comes to life. 🇮🇳#NeerajChopraClassic #GameOfThrows #NeerajChopra pic.twitter.com/RxIluzM1zw
— Neeraj Chopra Classic (@nc_classic) July 4, 2025
కర్నాటక ఒలింపిక్ సంఘం, ప్రపంచంలోని పలువురు అథ్లెట్లు, స్పాన్సర్లు ఈ టోర్నీని విజయవంతం చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. మీ అందరి తోడ్పాటుతో తొలి ఎడిషన్‌ను కన్నులపండువగా జరపాలని భావిస్తున్నాం’ అని నీరజ్ వెల్లడించాడు. ఈమధ్యే పారిస్ డైమండ్ లీగ్ టైటిల్, గోల్డెన్ స్పైక్స్ అథ్లెటిక్స్‌లో విజేతగా నిలిచిన నీరజ్ మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం మే నెలలోనే నీరజ్ చోప్రా క్లాసిక్ తొలి ఎడిషన్ జరగాల్సింది. కానీ, పహల్గాంలో ఉగ్రదాడి.. ‘ఆపరేషన్ సిందూర్’ తదనంతర పరిణామాల కారణంగా లీగ్‌ను వాయిదా వేశారు. భారత్, పాక్‌లు కాల్పుల విరణమణకు అంగీకరించిన తర్వాత కొత్త షెడ్యూల్ విడుదల చేసిన నిర్వాహకులు.. జూలై 5న టోర్నీ జరపాలని నిర్ణయించారు. ఈ మెగా అథ్లెటిక్స్ ఈవెంట్లో చోప్రాతో పాటు కర్టిస్ థాంప్సన్(అమెరికా), మార్టిన్ కొనెస్నీ(చెచియా), జులియస్ యెగో(కెన్యా), సిప్రియన్ రిజ్గోల్డ్(పొలాండ్), లూయిజ్ మౌరిసియో డ సిల్వా(బ్రెజిల్), రుమేశ్ పథిరగె(శ్రీలంక), థామస్ రొహెల్హర్(జర్మనీ)లు పాల్గొంటున్నారు.
Global Javelin Stars, One Indian Stage. 🤩
Witness global rivalries, homegrown heroes, and gravity-defying throws. Don’t miss this clash of champions. 💪#NeerajChopraClassic pic.twitter.com/dyoLEmgQIr
— Olympic Khel (@OlympicKhel) July 4, 2025