బెంగళూరు: భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తన ఖాతాలో మరో టైటిల్ను వేసుకున్నాడు. తనతో పాటు జేఎస్డబ్ల్యూ సంయుక్తంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా నిర్వహించిన మొదటి నీరజ్ చోప్రా (ఎన్సీ) క్లాసిక్ టైటిల్ను భారత అథ్లెట్ గెలుచుకున్నాడు. 27 ఏండ్ల ఈ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్.. మూడో ప్రయత్నంలో బరిసెను 86.18 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచాడు.
తద్వార పారిస్ డైమండ్ లీగ్, గోల్డెన్ స్పైక్ తర్వాత అతడి ఖాతాలో ఇది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. కెన్యా అథ్లెట్ జులియస్ యెగొ (84.51 మీటర్లు), శ్రీలంకకు చెందిన రుమేశ్ (84.34) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.