ఢిల్లీ : భారత అథ్లెట్, మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి పోలండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ వీస్లా మానియక్ మెమొరియల్ టోర్నీలో స్వర్ణం సాధించి సత్తాచాటింది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవల్ మీట్లో భాగంగా జరిగిన పోటీల్లో రాణి.. బరిసెను 62.59 మీటర్లు విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదుచేసింది.
తొలి ప్రయత్నంలోనే ఆమె 60 మీటర్ల మార్కును అందుకుంది. ఇదే టోర్నీలో రజతం, కాంస్యం గెలిచిన అథ్లెట్లు సైతం 60 మీటర్ల మార్కును అందుకోలేకపోయారు. టర్కీకి చెందిన ఎడా టుగ్సుజ్ (58.63 మీటర్లు) రెండో స్థానంలో నిలవగా, లియాన్నా డేవిడ్సన్ (ఆస్ట్రేలియా.. 58.24) మూడో స్థానంతో కాంస్యం గెలుచుకుంది.