Hardhik – Natasha : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardhi Pandya), నటాషా స్టాంకోవిక్ (Natasha Stankovic)లు విడిపోయి దాదాపు నెల కావోస్తోంది. అసలు వాళ్ల మధ్య ఏం గొడవ జరిగింది? ఎందుకు విడిపోయారు? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అన్యోన్యంగా నాలుగేండ్లకు పైగా సాగిన ప్రణయ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేయడం వెనుక మతలబు ఏంటీ? అనేది హార్దిక్ అభిమానులకు ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే మిగిలింది. అయితే.. పాండ్యాకు విడాకులు ఇచ్చాక నటాషా సోషల్‌మీడియాలో కొన్ని పోస్ట్‌లను ఎక్కువగా లైక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మోడల్, నటి అయిన నటాషా ఆన్లైన్లో యాక్టివ్‌గా ఉంటుంది. పాండ్యాతో తెగతెంపుల తర్వాత ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌లో టాక్సిక్ రిలేషన్షిప్ (Toxic Relationship), చీటింగ్ పోస్ట్‌లను ఆమె ఎక్కువగా లైక్ చేసింది. ఆమె ఇటువంటి పోస్టులు, వీడియోలను లైక్ చేసిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. పాండ్యాను ఇన్‌స్టాలో నటాషా అన్‌ఫాలో చేసినప్పుడు కూడా టాక్సిక్ రిలేషన్షిప్ పోస్టులు వైరల్ అయ్యాయి.
Natasa Stankovic Liked Reels About Cheating & Emotional Abuse: Apparently Hardik Cheated On Her, Leading To Divorce☕️
byu/Unique_Ad4358 inInstaCelebsGossip
నటాషాను టార్గెట్ చేస్తూ కొందరు పలు పోస్టలు పెట్టారు. అవి చూసిన ఆమె.. పాండ్యాతో ఇక జీవితాంతం కలిసి ఉండలేననే నిర్ణయానికి వచ్చిన ఆమె అతడితో బంధాన్ని తెంచేసుకుంది. ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిన ఆమె తనకు నచ్చిన పోస్ట్‌లను మొహమాటం లేకుండా లైక్ చేస్తోంది.
టీ20 వరల్డ్ కప్ హీరోగా స్వదేశం వచ్చిన పాండ్యా వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే భార్య నటాషాతో తెగతెంపులు చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే..? ‘నాలుగేండ్ల దాంపత్య జీవితం తర్వాత పరస్పర ఒప్పందంతో నటాషా, నేను విడాకులకు సిద్ధమయ్యాం. కలిసి బతికేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, కుదరలేదు.
దాంతో, ఇద్దరి ప్రయోజనాల మేరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు పుట్టిన అగస్త్య ఇక ముందు కూడా మా ఇద్దరి ప్రేమను పొందనున్నాడు. కో పేరెంట్‌గా అతడికి అన్ని సమకూర్చడమే కాకుండా, అతడిని సంతోషంగా ఉంచుతాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతకు భంగం కలిగించ వద్దని అభిమానులను కోరుతున్నా’ అని పాండ్యా వెల్లడించాడు.
మోడల్ అయిన నటాషాకు, పాండ్యాకు కరోనా సమయం (Corona Time)లోపెళ్లి అయింది. ప్రస్తుతం ఈ జంటకు అగస్త్య (Agastya) అనే పిల్లాడు ఉన్నాడు. అయితే.. హార్దిక్ – నటాషాలు ఈ మధ్యే రెండోసారి వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. కొడుకు ఉన్నాక మళ్లీ పెండ్లి చేసకోవడానికి కారణం ఎంటో తెలుసా..? 2020 మార్చి 31న అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది.
అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల ముందు వైభవంగా మనువాడాలని హార్దిక్, నటాషాలు అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ముహూర్తం పెట్టుకున్నారు. ఉదయ్‌పూర్ వేదికగా కన్నులపండువగా వీళ్లు రెండోసారి వివాహం చేసుకున్నారు. కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు. అనుకున్నట్టుగానే తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మలచుకున్న విషయం తెలిసిందే.