Roy Benjamin : పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ రాయ్ బెంజమిన్ (Roy Benjamin) రెండు పసిడి పతకాలతో మెరిశాడు. చిరుతలా పరుగెత్తే రాయ్ 400 మీటర్ల హర్డిల్స్. పురుషుల 4×400 మీటర్ల రేలేలో స్వర్ణం కొల్లగొట్టాడు. విశ్వ క్రీడల్లో అతడు పతకం గెలవగానే అమెరికావాళ్లే కాకుండా వెస్టిండీస్ ప్రజలు కూడా సంబురాలు చేసుకున్నారు.
అలా ఎందుకంటే.. ట్రాక్ మీద అతడి వేగం చూసి షాకైన అందరికీ తెలియని విషయం ఒకటుంది. రాయ్ ఓ దిగ్గజ క్రికెటర్ కుమారుడు. వెస్టిండీస్ మాజీ ఆటగాడైన విన్స్టన్ బెంజమిన్ (Winston Benjamin) వారసుడు రాయ్.తండ్రి అడుగుజాడల్లో నడువకుండా రాయ్ అథ్లెటిక్స్ను కెరీర్‌గా ఎందుకు ఎంచుకున్నా వచ్చాడు? అనేది తెలియాలంటే అతడి కథ పూర్తిగా చదవాల్సిందే.
KING BEN 👑
Rai Benjamin got his gold in the 400 hurdles with a 46.46 at #Paris2024 🇺🇸#ParisOlympics pic.twitter.com/wsDIhN2IOU
— USATF (@usatf) August 9, 2024
తండ్రి విన్స్టన్ పుట్టి పెరింగింది అంటిగ్వాలో. కానీ, రాయ్ అమెరికాలోనే జన్మించాడు. అమెరికన్గానే పెరిగాడు. చిన్నప్పుడు అతడు కూడా తండ్రి లెక్క ఫాస్ట్ బౌలర్ అవ్వాలని కలలు కన్నాడు. అనుకోవడం ఏంటీ ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాడు. అయితే.. వేగంగా పరుగెత్తే నైపుణ్యం గల రాయ్‌ను అతడి కోచ్‌లు అథ్లెటిక్స్ వైపు మళ్లించారు. అది అతడి జీవితంలో టర్నింగ్ పాయింట్. అక్కడితో ఇక ట్రాక్ మీద అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు.
తండ్రితో చిన్నారి రాయ్
నాలుగేండ్ల క్రితం టోక్యోలో రజతంతో సరిపెట్టుకున్న రాయ్ ఈసారి పసిడి కలను నిజం చేసుకున్నాడు. దాంతో, కుమారుడి విజయాన్ని చూసి విండీస్ మాజీ క్రికెటర్ ఉప్పొంగిపోయాడు. ‘అతడు అమెరికాలో పుట్టాడు. అందుకని అమెరికన్ల మాదిరిగానే మేము అతడి పతక విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కొడుకును ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్గా చూసిన మరే వ్యక్తిని నేను కలువలేదు. ఇది నిజంగా గొప్ప క్షణం. అతడు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు’ అని విన్స్టన్ తెలిపాడు. బెంజమిన్ తొమ్మిదేండ్లు విండీస్ జట్టుకు ఆడాడు. 1986 – 1995 మధ్య అతడు 21 టెస్టులు, 85 వన్డేల్లో కరీబియన్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.