35 Chinna Katha Kaadu | కేరళకుట్టి నివేదా థామస్ (Nivetha Thomas) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం 35- చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu). నందకిశోర్ (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో సరస్వతి పాత్రలో నటిస్తోంది నివేదా థామస్. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే.
అయితే ఎవరూ ఊహించని విధంగా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అటెన్షన్.. టీచర్ చెప్తే వినాలి.. విడుదల తేదీ మారాలి.. కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని సురేశ్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే సరస్వతి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ షేర్ చేయగా.. నివేదా థామస్ సంప్రదాయక చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడే గృహిణిగా కనిపిస్తోంది.
ఇక టీజర్.. విలువే లేని సున్నా పక్కన ఒకటి వేస్తే పది.. 9 కన్నా పెద్దదని ఎట్లా చెప్తరు.. అంటూ నివేదా థామస్ అడిగే చిలిపి ప్రశ్నతో మొదలవుతూ ఫన్నీ ఎలిమెంట్స్‌తో సరదాగా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్రామంలోని చిన్న కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో రాబోతున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Attention Everybody!!
Teacher chepparu “Peddha Cinema ante Postpone Avvali… Adhe Trend”
😛😊🤪Theatres lo Mana #35Movie Family Drama Syllabus tho athi twaralo Kaludham❤️#35CKK ~ Chinna Katha Kaadu
NEW RELEASE DATE EQUATION LOADING…📋@i_nivethathomas @PriyadarshiPN… pic.twitter.com/okPfyPw7Zz— Suresh Productions (@SureshProdns) August 12, 2024
Gabbar Singh 4K | గబ్బర్ సింగ్‌తో అదే ట్రెండ్ సెట్ చేయబోతున్న పవన్ కల్యాణ్..!
Kanguva Trailer | సూర్య, బాబీడియోల్ రౌద్రరూపం.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న కంగువ ట్రైలర్
Abhishek Bachchan | ఐశ్వర్యారాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే…!