ప్రపంచ అథ్లెటిక్స్‌కు అర్హత
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ స్ప్రింటర్ అగసర నందిని కెరీర్లో కీలక మలుపు. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి నందిని.. నైరోబీలో జరిగే ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీకి అర్హత సాధించి ఔరా అనిపించింది. ఈనెల 17 నుంచి 22 వరకు జరిగే టోర్నీలో నందిని భారత్ తరఫున బరిలోకి దిగనుంది. ఫెడరేషన్ కప్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నందిని స్వర్ణ పతకం సాధించడం ద్వారా ప్రపంచ టోర్నీకి అర్హత పొందింది. ఆదివారం జరిగిన 100మీటర్ల హార్డిల్స్ రేసును నందిని 13.96 సెకన్లలో ముగించింది.