హైదరాబాద్, ఆట ప్రతినిధి: చైనాలోని ఒర్డొస్లో జరుగుతున్న ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ యువ అథ్లెట్ నారిమళ్ల ప్రవళిక సత్తాచాటింది. ప్రవళిక, శ్రావణి, నోఫిసా, సాండ్రా మొల్ సబూతో కూడిన 4X400 భారత రిలే జట్టు.. 3:33.62 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తిచేసి దేశానికి పసిడి పతకాన్ని అందించింది. ఈ పోటీల్లో చైనాకు రజతం, కజకిస్థాన్‌కు కాంస్యం దక్కాయి. కాగా ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. నల్లగొండ జిల్లా డిండి మండలానికి చెందిన ప్రవళిక.. ప్రస్తుతం చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నది.