Twinkle Chaudhary : భారత అథ్లెట్లు వరుసగా డోప్ పరీక్షలో దొరికిపోతున్నారు. ఈమధ్యే క్వార్టర్ మిలర్(400 మీటర్ల రన్నర్) స్నేహ కొల్లేరి (Sneha Kolleri) నిషేధానికి గురవగా.. తాజాగా జాతీయ స్థాయిలో పలు పతకాలు గెలుపొందిన రన్నర్ ట్వింకిల్ చౌదరీ (Twinkle Chaudhary) సైతం డోప్ టెస్టులో పట్టుబడింది. అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటుతున్న ఆమె అనూహ్యంగా నిషేధిత డ్రగ్ తీసుకొని బుక్ అయిందది. దాంతో, అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ ఆమెపై నిషేధం విధించింది.
నిరుడు ఉత్తరాఖండ్‌లో జరిగిన 4×400 మీటర్ల రీలే పోటీల్లో స్వర్ణం సాధించిన బృందంలో ట్వింకిల్ సభ్యురాలు. అదే ఈవెంట్లో 4×400 మీటర్ల మిక్స్డ్ రీలేలో కాంస్యం గెలుపొందిందీ అథ్లెట్. కెరియర్లో ఒక్కోమెట్టు ఎక్కుతున్న సమయంలోనే ట్వింకిల్ డోప్ పరీక్షలో విఫలమైంది. ఆమె రక్త నమూనాల్లో నిషేధిత మిథైల్టెస్టోస్టిరాన్ (Methyltestosterone) డ్రగ్ ఉంది. ఇది ఒక అనబాలిక్ స్టిరాయిడ్. డోప్ టెస్టు ఫలితాలు రాగానే ఆమెకు ఏఐయూ నోటీసులు పంపింది. తర్వాతి దశలో ట్వింకిల్ స్వయంగా ఏఐయూ అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
#BigNews 🚨🚨
Middle distance runner Twinkle Chaudhary has been provisionally suspended by the Athletics Integrity Unit (AIU) after testing positive for a prohibited steroid.The 28-year-old had clinched a gold in 4x400m women’s relay competition at the National Games earlier… pic.twitter.com/iuBDUSuRuf
— The Bridge (@the_bridge_in) June 27, 2025
జలంధర్‌కు చెందిన ట్వింకిల్ చిన్నప్పట్నుంచి ఆటల్లో ముందుండేది. చిరుతలా పరుగెత్తే ఆమె అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపింది. ఈమధ్యే కొచ్చిలో జరిగిన 28వ జాతీయ సమాఖ్య సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో ట్వింకిల్ సత్తా చాటింది. 800 మీటర్ల పరుగులో 2:00:71 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకొని రికార్డున నెలకొల్పింది. జూన్‌లో తైవాల్ ఓపెన్‌లోనూ తనకు తిరుగులేదని చాటుతూ వెండి పతకంతో మెరిసింది 28 ఏళ్ల ట్వింకిల్. దక్షిణ కొరియాలో మే నెలలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచింది .