Anti-begging drive : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) కి చెందిన అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (UCD) విభాగం అధికారులు నగరంలోని బిచ్చగాళ్లను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ (Special drive) నిర్వహించింది. హైదరాబాద్‌ను బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చాలనే ఉద్దేశంతో అధికారులు ఈ డ్రైవ్ నిర్వహించారు.
ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా యూసీడీ విభాగం అధికారులు బషీర్‌బాగ్, నాంపల్లి, సెక్రెటేరియట్, బేగంబజార్ ఏరియాల్లోని ట్రాఫిక్ జంక్షన్లు, ఫూట్‌పాత్‌లపై నిర్వాసితులుగా ఉన్న 221 మందిని గుర్తించారు. వారిలో 202 మందికి కౌన్సిలింగ్ వారి స్వస్థలాలకు పంపించారు. మరో 19 మంది తమకు ఎవరూ లేరని చెప్పడంతో వారికి నైట్ షెల్టర్లలో ఆశ్రయం కల్పించారు.
ఈ యాంటీ బెగ్గింగ్ డ్రైవ్ ఇంతటితో ముగియలేదని, ఇక ముందు కూడా కొనసాగుతుందని, నగరంలోని అన్ని ప్రాంతాల్లో బిచ్చగాళ్లు లేకుండా చేయడమే తమ లక్ష్యమని జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం అధికారి ఒకరు చెప్పారు.