Punjab | పంజాబ్ (Punjab) కాల్పుల కలకలం రేపింది. గ్యాంగ్స్టర్ జగ్గూ భగవాన్ పురియా (Jaggu Bhagwanpuria) తల్లి హర్జీత్ కౌర్ దారుణ హత్యకు గురయ్యారు (Gangsters Mother Shot Dead). కారులో ఉన్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. బటాలా (Batala) నగరంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఖాడియన్ రోడ్డులో గురువారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో హర్జిత్ కౌర్ కారులో కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఆమెను అమృత్సర్లోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. హంతకులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
Kolkata | కోల్కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
building collapses | భారీ వర్షాలకు కుప్పకూలిన భవనం.. ముగ్గురు వలస కార్మికులు మృతి