building collapses | దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా కేరళ (Kerala)లో భారీ వర్షాల కారణంగా రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు వలస కార్మికులు (migrant workers) ప్రాణాలు కోల్పోయారు.
త్రిస్సూర్ (Thrissur)లోని కొడకరాలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో వలస కార్మికులు నివసిస్తున్న రెండంతస్తుల పాత భవనం కూలిపోయింది. ఉదయం చాలా మంది కార్మికులు పనికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రాహుల్ (19), రూపేల్ (21), అలీమ్ (30) మరణించారు. మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో అందులో దాదాపు 17 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. 14 మంది ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం.
Also Read..
Jagannath Rath Yatra | ప్రారంభమైన పూరీ జగన్నాథుని రథయాత్ర.. తరలి వచ్చిన భక్తజనం
Floods | హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు.. 250 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్