Samit Dravid : భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) వారసుడు క్రికెట్లో దూసుకొస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందని సమిత్ ద్రావిడ్ (Samit Dravid) తాజాగా టీ20 వేలంలో భారీ ధర పలికాడు. కర్నాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 వేలంలో మైసూర్ వారియర్స్(Mysore Warriors) ఫ్రాంచైజీ సమిత్‌ను రూ.50 వేలకు కొన్నది.
దిగ్గజ క్రికెటర్ కుమారుడైన సుమిత్ అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్నాడు. అండర్ -15లోనూ మెరుపులు మెరిపించిన సమిత్.. కర్నాటక అండర్ -19 జట్టు తరఫున ఇరగదీశాడు. 2023-24 సీజన్లో కూచ్ బెహర్ ట్రోఫీ (Cooch Behar Trophy)లో జమ్మూ కశ్మీర్ జట్టుపై 98 పరుగులతో మెరిశాడు.
Rahul Dravid’s son Samit Dravid scored 98 runs against J&K in Cooch Behar Trophy.pic.twitter.com/lMFBtpImrq
— Ishan Joshi (@ishanjoshii) December 21, 2023
దాంతో, గురువారం జరిగిన మహారాజా ట్రోఫీ టీ20 వేలంలో యంగ్ ద్రవిడ్‌ను దక్కించుకునేందుకు పలు జట్లు పోటీపడ్డాయి. చివరకు గత సీజన్ రన్నరప్ మైసూర్ జట్టు ఈ ఆల్‌రౌండర్‌ను అర లక్షకు సొంతం చేసుకుంది.
మహారాజా టీ20 ట్రోఫీ వేలంలో విధ్వంసక క్రికెటర్ అయిన ఎల్ఆర్ చేతన్(LR Chetan) అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ.8.6 లక్షలకు బెంగళూరు బ్లాస్టర్స్ అతడిని కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఆటగాళ్లకు వేలంలో భారీ ధర దక్కింది.
ఎల్ఆర్ చేతన్
ఐపీఎల్లో అదరగొట్టిన స్పిన్నర్లు శ్రేయాస్ గోపాల్(రూ.7.6 లక్షలు), కృష్ణప్ప గౌతమ్(రూ.7.4 లక్షలు), ప్రవీణ్ దూబే(రూ.6.8లక్షలు)లు లక్షలు కొల్లగొట్టారు. ఆరు జట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీ బెంగళూరు వేదికగా ఆగస్టు 15వ తేదీన మొదలవ్వనుంది.