బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో ముంబై యువ క్రికెటర్ సిమ్రాన్ షేక్ రికార్డు ధర పలికింది. ఆదివారం జరిగిన వేలంలో అన్క్యాప్డ్ సిమ్రాన్‌ను ఏకంగా 1.90 కోట్లతో గుజరాత్ జెయింట్స్ జట్టు తీసుకుంది. రానున్న సీజన్ కోసం నిర్వహించిన ఈ వేలంలో సిమ్రాన్ కోసం గుజరాత్, ఢిల్లీ హోరాహోరీగా తలపడ్డాయి.
5 లక్షల కనీస ధరతో వేలంలోకి ప్రవేశించిన ఈ యువ క్రికెటర్‌ను ఎట్టకేలకు గుజరాత్ తమ వశం చేసుకుంది. సిమ్రాన్ తర్వాత వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ దియోంద్ర డాటిన్ (1.70 కోట్లు, గుజరాత్), కమలిని (1.60 కోట్లు, ముంబై ఇండియన్స్), ప్రేమరావత్ (1.20 కోట్లు, ఆర్సీబీ)తమ సొంతం చేసుకున్నాయి. వేలంలో మొత్తం 120 మంది ప్లేయర్లు 19 బెర్తుల కోసం పోటీపడ్డారు.