ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముం బై ఇండియన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో ముంబై 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది.
నికోలా కారె(3/37), అమెలియా కెర్(3/24) ధాటికి ఢిల్లీ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. చినెల్లీ హెన్రీ(56) మినహా ఎవరూ రాణించలేకపోయారు. తొలుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(74 నాటౌట్), సీవ ర్ బ్రంట్(70) అర్ధసెంచరీలతో ముం బై 20 ఓవర్లలో 195/4 స్కోరు చేసింది. కెప్టెన్ కౌర్ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో అదరగొట్టింది. నందనిశర్మ (2/26) రెండు వికెట్లు తీసింది.