Team India Victory Parade | జనసంద్రమైన ‘మరైన్ డ్రైవ్’.. ముంబైవాసులకు పోలీసుల హెచ్చరిక
Team India Victory Parade : టీమిండియా 'విక్టరీ పరేడ్' కోసం అరేబియన్ సముద్రపు ఒడ్డున లక్షల మంది చేరారు. దాంతో, వాంఖడే స్టేడియం పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు వాహనదారులను మరైన్ డ్రైవ్ వైపు రావొద్దంటూ హెచ్చరించారు.
Team India Victory Parade : ఐసీసీ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టు(Team India)కు దేశమంతా జేజేలు పలుకుతోంది. ఓపెన్ టాప్ బస్సులో జరుగబోయే ‘విక్టరీ పరేడ్’ కోసం ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వరల్డ్ కప్ వీరులకు స్వాగతం పలికేందుకు బారులు తీరారు. ‘నారీమన్ పాయింట్’ (Naiman Point) నుంచి మొదలవ్వనున్న విజయోత్సవ యాత్రలో పాల్గొనేందుకు అరేబియన్ సముద్రపు ఒడ్డున లక్షల మంది చేరారు.
దాంతో, వాంఖడే స్టేడియం పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు వాహనదారులను మరైన్ డ్రైవ్ వైపు రావొద్దంటూ హెచ్చరించారు. ‘మరైన్ డ్రైవ్ ప్రాంతం మొత్తం నిండిపోయింది. ఇటువైపు ఎవరూ రావొద్దు’ అంటూ జనసంద్రమైన ఫొటోను పోస్ట్ చేశారు.

ప్రత్యేక విమానంలో..
బార్బడోస్‌లో పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత జట్టు బెరిల్ తుఫాన్ (Beryl Hurricane) కారణంగా స్వదేశంలో ఆలస్యంగా అడుగుపెట్టింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జూలై 4 ఉదయం టీమిండియా ఢిల్లీలో దిగగానే దేశమంతా మరొకసారి సంబురాల్లో మునిగిపోయింది.
𝙎𝙀𝘼 𝙊𝙁 𝘽𝙇𝙐𝙀! 💙
From #TeamIndia to the fans, thank you for your unwavering support 🤗#T20WorldCup | #Champions pic.twitter.com/GaV49Kmg8s
— BCCI (@BCCI) July 4, 2024
వరల్డ్ కప్ ట్రోఫీతో ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన భారత జట్టు సభ్యులు.. అశేష అభిమానుల సమక్షంలో వికర్టీ పరేడ్‌కు రెడీ అయ్యారు. సాయంత్రం 4ః30 గంటలకు అనుకున్న మెరైన్ డ్రైవ్ పరేడ్ మరికాసేపట్లో షురూ కానుంది. అక్కడ ఓపెన్ టాప్ బస్సులో రోహిత్ సేన వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ.. సందడిగా ముందుకు సాగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మానం చేయనుంది.
A memorable occasion as #TeamIndia got the opportunity to meet the Honourable Prime Minister of India, Shri Narendra Modiji in Delhi 🙌@narendramodi | @JayShah pic.twitter.com/eqJ7iv9yVw
— BCCI (@BCCI) July 4, 2024
ఇవి కూడా చదవండి
- Trains cancell | వాల్తేరు డివిజన్లో ఈనెల 5,6 తేదీలల్లో పలు రైళ్లు రద్దు
- Baby Carrots | బేబీ క్యారెట్స్‌తో మెరిసే చర్మం సొంతం
- TG EAPCET | టీజీ ఎస్సెట్ కౌన్సెలింగ్.. తొలి రోజు 56674 మంది స్లాట్ బుకింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

