ఆరంభంలో నెమ్మదిగా ఆడి.. ఆ తర్వాత భారీ విజయాలతో ప్లే ఆఫ్స్‌కు దూసుకురావడాన్ని అలవాటుగా చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. ముందంజ వేయాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ తేడాతో నెగ్గాల్సిన దశలో ముంబై బ్యాటర్లు విశ్వరూపం కనబర్చినా.. బౌలింగ్‌లో విఫలమైన రోహిత్ సేన లీగ్ దశతోనే పారాటాన్ని ముగించింది. దీంతో ఊపిరి పీల్చుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ సోమవారం జరుగనున్న ఎలిమినేటర్‌లో బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమవుతున్నది!
అబుదాబి: ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే భారీ విజయం సాధించాల్సిన దశలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు వీరవిహారం చేసినా.. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో రోహిత్ సేనకు నిరాశ తప్పలేదు. ముందంజ వేయాలంటే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 171 పరుగుల తేడాతో నెగ్గాల్సిన స్థితిలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై శుక్రవారం 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది. ఫలితంగా చివరి పోరులో నెగ్గినా.. ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్త్ అందని ద్రాక్షగానే మిగిలింది. 14 పాయింట్లతోనే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. మొదట 20 ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగులు చేసింది. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 84; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 82; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర విధ్వంసం సృష్టించారు. కౌల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టి ఇషాన్ ప్రారంభించిన దంచుడు.. ఆఖరి వరకు అదే రేంజ్లో కొనసాగింది. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీయే అన్న చందంగా విరుచుకుపడిన ఇషాన్ 16 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (18) కూడా ధాటిగానే ఆడాడు. ఫలితంగా ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై 78/0తో నిలిచింది. రషీద్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ కాగా.. హార్దిక్ పాండ్యా (10), ప్రభావం చూపలేకపోయాడు. 7.1 ఓవర్లలో 100 పరుగులు దాటిన ముంబై కాసేపటికే ఇషాన్ వికెట్ కోల్పోయింది. పొలార్డ్ (13), నీషమ్ (0)ను అభిషేక్ శర్మ వరుస బంతుల్లో ఔట్ చేయగా.. అక్కడి నుంచి సూర్యకుమార్ షో ప్రారంభమైంది. బౌలర్‌తో సంబంధం లేకుండా ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడిన సూర్యకుమార్ జట్టుకు భారీ స్కోరు సాధించిపెట్టాడు. చివరి ఓవర్లో సూర్య ఔట్ కావడంతో ముంబై 5 పరుగులే చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లలో హోల్డర్ 4, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ చెరో రెండు వికెట్లు పడగట్టారు. అనంతరం కొండంత లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. స్టాండిన్ కెప్టెన్ మనీశ్ పాండే (69 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో నీషమ్, బుమ్రా, కౌల్టర్‌నైల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
ఐపీఎల్లోముంబైకి ఇదే అత్యధిక స్కోరు (235/9)
ఐపీఎల్ 14వ సీజన్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం (16 బంతుల్లో) సాధించిన
ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు.
ఐపీఎల్లో తొలి నాలుగు
తొలి పది ఓవర్లలో ముంబై చేసిన స్కోరు. ఐపీఎల్లో ఇదే అత్యధికం. 2014లో హైదరాబాద్‌పై పంజాబ్ కూడా సరిగ్గా ఇన్నే పరుగులు చేసింది.
ఐపీఎల్ 14వ సీజన్లో వేగవంతమైన (గంటకు 152.95 కిలోమీటర్లు) బంతి విసిరిన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) నిలిచాడు.
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (30) కొట్టిన రెండో జట్టుగా ముంబై నిలిచింది. ఢిల్లీ (31; 2017లో గుజరాత్ లయన్స్‌పై) అగ్రస్థానంలో ఉంది.
ఐపీఎల్లో ఒకే మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్న తొలి ఫీల్డర్‌గా
మహమ్మద్ నబీ రికార్డుల్లోకెక్కాడు
ఓవర్లలోనే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్న రెండో ఆటగాడిగా కిషన్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఢిల్లీతో మ్యాచ్‌లో 2.5 ఓవర్లలోనే ఫిఫ్టీ కొట్టాడు.
పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా ఇషాన్ (63) నిలిచాడు. రైనా (87; 2014లో పంజాబ్‌పై), గిల్‌క్రిస్ట్ (74; 2009 ఢిల్లీపై) ముందున్నారు.
స్కోరు బోర్డు
ముంబై: రోహిత్ (సి) నబీ (బి) రషీద్ 18, ఇషాన్ (సి) సాహా (బి) ఉమ్రాన్ 84, హార్దిక్ (సి) రాయ్ (బి) హోల్డర్ 10, పొలార్డ్ (సి) రాయ్ (బి) అభిషేక్ 13, సూర్యకుమార్ (సి) నబీ (బి) హోల్డర్ 82, నీషమ్ (సి) నబీ (బి) అభిషేక్ 0, కృనాల్ (సి) నబీ (బి) రషీద్ 9, కౌల్టర్‌నైల్ (సి) నబీ (బి) హోల్డర్ 3, చావ్లా (సి) సమద్ (బి) హోల్డర్ 0, బుమ్రా (నాటౌట్) 5, బౌల్ట్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 235/9. వికెట్ల పతనం: 1-80, 2-113, 3-124, 4-151, 5-151, 6-184, 7-206, 8-230, 9-230, బౌలింగ్: నబీ 3-0-33-0, కౌల్ 4-0-56-0, హోల్డర్ 4-0-52-4, ఉమ్రాన్ 4-0-48-1, రషీద్ 4-0-40-2, అభిషేక్ 1-0-4-2.
హైదరాబాద్: రాయ్ (సి) కృనాల్ (బి) బౌల్ట్ 34, అభిషేక్ (సి) కౌల్టర్‌నైల్ (బి) నీషమ్ 33, పాండే (నాటౌట్) 69, నబీ (సి) పొలార్డ్ 3, సమద్ (సి) పొలార్డ్ (బి) నీషమ్ 2, గార్గ్ (సి) హార్దిక్ (బి) బుమ్రా 29, హోల్డర్ (సి) బౌల్ట్ (బి) కౌల్టర్‌నైల్ 1, రషీద్ (సి అండ్ బి) బుమ్రా 9, సాహా (సి అండ్ బి) కౌల్టర్‌నైల్ 2, కౌల్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 193/8. వికెట్ల పతనం: 1-64, 2-79, 3-97, 4-100, 5-156, 6-166, 7-177, 8-182, బౌలింగ్: బౌల్ట్ 4-0-30-1, బుమ్రా 4-0-39-2, చావ్లా 4-0-38-1, కౌల్టర్‌నైల్ 4-0-40-2, నీషమ్ 3-0-28-2, కృనాల్ 1-0-16-0.