IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి పలు రికార్డులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఓవైపు స్టార్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటే.. కొత్త కుర్రాళ్లు సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తుంటారు. 18వ సీజన్ ఆరంభంలోనే విఘ్నేశ్ పుతూర్ (Vighnesh Puthur) రూపంలో ఓ తార పుట్టుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఈ మలయాళీ సెన్సేషనల్ బౌలింగ్‌లతో వారెవా అనిపించాడు. చెపాక్ స్టేడియంలో బంతిని ఫ్లైట్ చేస్తూ.. వరల్డ్ క్లాస్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు 24 ఏళ్ల విఘ్నేశ్.
బంతిని గింగిరాలు తిప్పిన అతడు 32కే మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సీఎస్కే నినాదాలతో మార్మోగుతున్న చెపాక్‌లో ఒక్కసారిగా నిశబ్దాన్ని నింపాడీ చైనామన్ బౌలర్. ఐపీఎల్లో.. అదీ మొదటి మ్యాచ్‌లో గుర్తిండిపోయే గణాంకాలు నమోదు చేసిన ఈ కుర్రాడిని ముంబై తరపుముక్కగా అభివర్ణిస్తున్నారు క్రికెట్ పండితులు.
‘ఐపీఎల్లో ఆడాలనేది నా కల. ఈ సీజన్‌తో అది నిజమైంది. నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. వరల్డ్ క్లాస్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటానని నేను అస్సలు ఊహించలేదు. ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎడిషన్‌లో మా జట్టుకు తొలి మ్యాచ్‌లోనే నాకు అవకాశమిచ్చి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ధన్యవాదాలు. అతడు నన్ను ఎంతో ప్రోత్సహించాడు. చెపాక్ స్టేడియంలో నా ప్రదర్శన పట్ల హ్యాపీగా ఉన్నాను. కాకపోతే మా టీమ్ గెలిచి ఉంటే మరింత సంతోషించేవాడిని. ప్రస్తుతం నా దృష్టంతా తర్వాతి మ్యాచ్‌ల మీదే ఉంది’ అని వెల్లడించాడు విఘ్నేశ్.
𝘼 𝙙𝙧𝙚𝙖𝙢 𝙙𝙚𝙗𝙪𝙩 ✨
Twin strikes from the young Vignesh Puthur sparks a comeback for #MI 💙
Updates ▶️ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @mipaltan pic.twitter.com/DKh2r1mmOx
— IndianPremierLeague (@IPL) March 23, 2025
విఘ్నేశ్ది కేరళలో మలప్పురం. కేరళ క్రికెట్ లీగ్‌లో నిలకడగా రాణించిన విఘ్నేశ్ పుతూర్ స్పిన్ ఆల్‌రౌండర్. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ ఎంఐ కేప్‌టైన్ నెట్ బౌలర్‌గా ఎంపికైన విఘ్నేశ్.. అక్కడ రషీద్ ఖాన్, ఆదిల్ రషీద్.. వంటి స్పిన్నర్లను చూసి మెలకువలు నేర్చుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ నెట్స్‌లో రోహిత్, సూర్య, తిలక్ వర్మలు ఈ కేరళ స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు అష్టకష్టాలు పడ్డారు. అందకే.. విఘ్నేశ్‌ను తొలి మ్యాచ్‌లోనే ఆడించాలని హెడ్ కోచ్ మహేల జయవర్ధనే నిర్ణయం తీసుకున్నాడు.
ప్రతిభావంతుడైన విఘ్నేశ్‌ను మెగా వేలంలో రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని విఘ్నేశ్ వమ్ము చేయలేదు. స్వల్ప ఛేదనలో ధాటిగా ఆడుతున్న చెన్నై బ్యాటర్లకు చెక్ పెట్టేందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని అతడికి ఇచ్చాడు. ఆడుతున్న తొలి మ్యాచ్ అయినా.. ఏమాత్రం ఒత్తిడి లేకుండా బౌలింగ్ చేసి దీపక్ హుడా వికెట్ సాధించాడీ యంగ్‌స్టర్.
Not the start we wanted.
Tap here to read more 👉 https://t.co/xPAlUU3IHI#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #CSKvMI pic.twitter.com/ulKpRxihUS
— Mumbai Indians (@mipaltan) March 23, 2025
ఆ తర్వాత అర్ధ శతకంతో జోరు మీదున్న రుతురాజ్ గైక్వాడ్, డేంజరస్ శివం దూబేలను ఔట్ చేసి ముంబైని పోటీలోకి తెచ్చాడు విఘ్నేశ్. 32 పరుగులకే 3 వికెట్లు పడగొట్టడంతో ఒక విజృంభణతో చెన్నై ఓటమి అంచున నిలిచింది. అయితే.. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ రచిన్ రవీంద్ర పట్టుదలగా పోరాడి సీఎస్కేను గెలిపించాడు. లేదంటే.. విఘ్నేశ్ ముంబై హీరో అయ్యేవాడే. . అనుకున్నట్టే ఈ చైనామన్ బౌలర్ తన తడాఖా చూపిస్తూ మూడు వికెట్లతో రాణించాడు. తమ జట్టును ముప్పతిప్పలు పెట్టిన విఘ్నేశ్‌ను మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ అభినందించడం విశేషం.