చెన్నూర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పై అనుచిత, అసత్య ఆరోపణలు చేసిన కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్( Bandi Sanjay ) పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు సోమవారం చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్‌కు ఫిర్యాదు (Complaint ) చేశారు.
బీఆర్ఎస్ ( BRS ) సీనియర్ నాయకులు వాల శ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ బండి సంజయ్ కేంద్ర కాబినెట్ లో ఉండి కూడా అబద్దాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన కేసీఆర్(KCR) పైన తన హోదా ను మరిచి బండి సంజయ్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ సాంబాగౌడ్, డైరెక్టర్ మనిశెట్టి మల్లయ్య, మండల యూత్ అధ్యక్షులు మారిశెట్టి విద్యాసాగర్, నాయకులు కొట్టె నారాయణ, తిరుపతి రావ్, అక్కల మధుకర్, చందు, రాళ్లబండి స్వామి, కామ శ్రీనివాస్, కుమార్, అజ్మీరా పున్నం మారపాక పోచం, గోనె మోహన్ రెడ్డి భూమయ్య, సందీప్ రెడ్డి, హైమద్, మండలసోషల్ మీడియా కన్వీనర్ ఆసంపెల్లి సంపత్ కుమార్, బాపు నాయక్, ఇందూరి మహేష్, కామెర పవన్, కొట్రంగి మల్లేష్, అజయ్,తదితరులు పాల్గొన్నారు .