బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలంలో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు కాసుల పంట పండింది. ఇవాళ్టి వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.8 కోట్లు వెచ్చించి ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆర్చర్‌ను పట్టుబట్టి మరీ వేలంలో దక్కించుకున్నది.
ఆర్చర్ గత ఏడాది మార్చి తర్వాత ఏ టోర్నీలోనూ ఆడలేదు. గత ఐపీఎల్ సీజన్లో పాల్గొనలేదు. యాషెష్ సిరీస్, టీ20 వరల్డ్‌కప్‌కు కూడా ఆర్చర్ దూరంగా ఉన్నాడు. అంతకుముందు ఐపీఎల్ సీజన్లో అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఇవాళ జరిగిన వేలంలో ఆర్చర్ కోసం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.
బిడ్డింగ్ రూ.6.25 కోట్లకు చేరేవరకు రెండు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ వేలం నుంచి తప్పుకుంది. కానీ, ఇంతలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీకి రావడంతో ఆర్చర్ ధర రూ.8 కోట్లకు పెరిగింది. కాగా, ఆర్చర్ 2018 నుంచి ఐపీఎల్ టోర్నీల్లో ఆడుతున్నాడు. మొత్తం మూడు సీజన్లలో ఆడిన ఆర్చర్ 35 గేమ్స్ ఆడి 46 వికెట్లు తీశాడు.